మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం
డోన్, న్యూస్ వెలుగు; సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫిసెప్టెంబర్ 15 మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్బంగా డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో సెప్టెంబర్ 15 మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు
విశ్వేశ్వరయ్య గారు 1860 సెప్టెంబరు 15 న కర్ణాటకలోని చిక్బళ్లాపుర్ తాలూకాలో ఉన్న ముద్దెనహళ్ళి గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బిఏ పూర్తి చేసిన విశ్వేశ్వరయ్య తర్వాత పుణే సైన్సు కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. చదువు పూర్తయ్యాక గవర్నమెంట్ ఆఫ్ బాంబే ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు.తర్వాత దక్కన్ ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు. ఈయన రూపకల్పన చేసిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను 1903 లో మొదటిసారిగా పుణే సమీపంలోని ఖడక్ వాస్లా వద్ద నెలకొల్పారు. వరదల సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటిని నిల్వచేయడానికి ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడింది. విశ్వేశ్వరయ్య పనితీరును గుర్తించిన బ్రిటిష్ పాలకులు సింధు రాష్ట్రంలోని ప్రముఖ సుక్నూర్‌బరాజ్ జలాశయ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమించారు. నాలుగేళ్లలో సింధు నది నీరు సుద్నోరుకు చేరేలా చేశాడు. మైసూర్ సమీపంలో నిర్మించిన కృష్ణరాజ సాగర్ ఆనకట్టకు ఆయనే చీఫ్ ఇంజనీర్‌గా వ్యవహరించారు. 1908లో మూసి నదికి వరదలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు అప్పటి నిజాం నవాబు విశ్వేశ్వరయ్యను ఆహ్వానించి వరద సమస్యకు పరిష్కారం సూచించాలని కోరారు. నిజాం విన్నపం మేరకు హైదరాబాద్‌కు పటిష్టమైన మురుగునీటి పారుదల వ్యవస్థను ఆయన రూపొందించారు. మూసీ, ఈసీ నదులపై రిజర్వాయర్లను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించి హైదరాబాద్ నగరానికి వరద ముప్పు తప్పించారు.1908 లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన మైసూర్ సంస్థానంలో దివానుగా పని చేశారు. భద్రావతి ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాట పట్టించారు. ఆయన కృషిని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదుతో సత్కరించింది.1955లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ విశ్వేశ్వరయ్యను వరించింది. సివిల్ ఇంజనీరింగ్‌లో నూతన ఒరవడి సృష్టించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరించుకోవడం కోసం ఆయన జయంతిని సెప్టెంబర్15 జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకొంటున్నాం. ఇలాంటి మహనీయులను అనుక్షణం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు