గ్రామాల్లో దోమల పెత్తనం : అనారోగ్యంతో ప్రజలు

Vontimitta (ఒంటిమిట్ట )న్యూస్ వెలుగు 30 : సిద్ధవటం మండలం జంగాలపల్లె పంచాయతీ కమ్మ పాలం గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులు దోమల బెడదతో డెంగ్యూ , మలేరియా వంటి వ్యాదులు ప్రభలే అవకాశం వుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం కావడం తో గ్రామంలో ఎటు చూసిన దోమలు చక్కర్లు కొడుతున్నాయని గ్రామస్తులు అన్నారు. దోమల ద్వారా అంటూ వ్యాదులు ప్రభలడమే కాకుండా చిన్న పిల్లలు , బాలింతలు అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. అధికారులు స్పందించి దోమలను నిర్మూలించాలని తమ ఆరోగ్యాలను కాపాడాలంటూ అధికారులను మంగళవారం కోరడం జరిగిందని తెలిపారు. చినుకు చిటుక్కుమన్నా గుంతల్లో వర్షపు నీరు చేరి రహదారి గుండా వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
Was this helpful?
Thanks for your feedback!