
.దేవనకొండలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎం.పి.
న్యూస్ వెలుగు, కర్నూలు; రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని
కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎం.పి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2019 కి ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం హయాంలో జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేదని , అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పథకాన్ని రద్దు చేసిందన్నారు.. మధ్యాహ్న భోజనం పథకం రద్దు చేయడంతో విద్యార్థుల డ్రాప్ ఆవుట్స్ పెరిగి పిల్లలు చదువులకు దూరమయ్యారని మండిపడ్డారు.. డ్రాప్ ఆవుట్స్ ను నివారించేందుకు మళ్ళీ ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు… ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు బాగా చదుకోవాలన్న ఎం.పి నాగరాజు..జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆలూరు జనసేన ఇంచార్జి వెంకప్ప, ఎం.ఆర్.ఓ లోకేష్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ వేణు గోపాలాచారి , దేవనకొండ మండల టీడీపీ,జనసేన , బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు..