కె.వి.ఆర్ కళాశాలకు ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు కేటాయిస్తున్నా

కె.వి.ఆర్ కళాశాలకు ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు కేటాయిస్తున్నా

  ఎంపీ బస్తి పాటి నాగరాజు

కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలోని కె.వి.ఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన 29వ వార్షికోత్సవ వేడుకలలో ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ముందుగా కళాశాల ప్రిన్సిపల్ జి లాలప్ప, DVEO పరమేశ్వర రెడ్డి, Rio గురువయ్య ఇతర అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసారు. ముందుగా ప్రిన్సిపల్ వార్షిక నివేదిక లో కళాశాల ఈ సంవత్సరం సొంత అస్తిత్వం ఏర్పడిందని అందుకు అనేకమంది తోడ్పాటు అందించారు అని చివరగా గత కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజనా గారు అని ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిధి కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కెవి ఆర్ జూనియర్ కళాశాల లో అందరూ పెద పిల్లలే అని వారి కష్టాలు తనకు తెలుసు అని, అధ్యాపకుడు గా పనిచేసిన తాను కెవి ఆర్ కళాశాల అభివృద్ధి కి కట్టుబడి ఉన్నా అని, అదనపు గదుల నిర్మాణానికి తన ఎంపీ నిధుల నుండి కళాశాల కు 10 లక్ష ల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కళాశాల అభివృద్ధికి నిత్యం కష్టపడుతున్న ప్రిన్సిపల్ గారిని అభినందించారు. విద్యార్థులు చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి కళాశాలకు పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమం లో పాల్గొన్న DVEO గారు కష్ట పడి చదివితే ఉన్నత స్థితి కి చేరుకుంటారు అని తెలిపారు RIO గురువయ్య మాట్లాడుతూ గొప్పవారి ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం కళాశాల విద్యార్థినిలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూ పర్లను కట్టి పడేసాయి. కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ చైర్మన్ శ్రీ మాధవ నాయుడు గారు, విశ్రాంత ప్రిన్సిపాల్ కృష్ణ రెడ్డి, చెన్నయ్య, సుంకన్న, శ్రీమతి సరళ దేవి కరుణాకర్ ప్రభు చరణ్ లు పాల్గొన్నారు కార్యక్రమములో అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!