
ఉపాధి పనులను తనిఖీ చేసిన ఎంపీడీవో
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల రామలింగాయపల్లి గ్రామం నందు నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ బుధవారం రోజున తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ కూలీలందరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. వలసల నివారణ కొరకే ఉపాధి పనులను నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ జాబ్ కార్డుకు దరఖాస్తు చేసుకొని ఉపాధి హామీ పనులలో పాల్గొనాలని ఆయన తెలియజేశారు. ఉపాధి హామీ పనులలో ఎలాంటి అవకతవకలు లేకుండా పనులను చక్కగా నిర్వహించాలని ఉపాధి హామీ సిబ్బందికి ఆయన తెలియజేశారు. అనంతరం ఉపాధి కూలీలకు సంబంధించి మస్టర్లను ఎంపీడీవో తనిఖి చేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దేవేంద్ర,ఉపాధి పనుల కూలీలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!