
విద్యావ్యవస్థ బలోపేతానికే ఎంపిటి సమావేశాలు
న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు ఉన్నతమైన స్థానాలను అధిరోహించడానికి మెగా పేరెంట్స్-టీచర్స్ (ఎం.పి.టి.) సమావేశాలు ఎంతో దోహదపడతాయని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ శనివారం కంట్రోల్ రూం వద్దనున్న
టౌన్ మోడల్ పాఠశాలలో నిర్వహించిన ఎంపిటి సమావేశానికి అదనపు కమిషనర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగి, వాటి బలోపేతానికి, విద్యార్థుల సంఖ్య పెంపునకు ఈ సమావేశాలు ఎంతో కీలకం అవుతాయన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో చేసుకుంటూ, పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి అదనపు కమిషనర్ భోజనం చేశారు. తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!