ఆక్యుపంక్చర్ సైన్స్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా ముంజంపల్లి

ఆక్యుపంక్చర్ సైన్స్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా ముంజంపల్లి

విజయవాడ, న్యూస్ వెలుగు; ఆక్యుపంచర్ సైన్స్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆఫ్ భారత్ (ఆస్పా) జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ నియమతులయ్యారు. ఈ మేరకు ఆస్ప భారత్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మాకాల సత్యనారాయణ నియామక పత్రాన్ని శుక్రవారం అందజేశారు. డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా వివిధ రంగాల్లో సేవలందిస్తూ కోవిడ్ సమయంలో ఎంతో మందికి వైద్య సేవలు అందించి వారి ప్రాణాలను నిలబెట్టిన ఎన్నో మెడికల్ క్యాంపులను నిర్వహించిన సామాజిక సేవ కార్యకర్త ముంజంపల్లి అని ఎన్నో మెడికల్ క్యాంపులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఆక్యుపంచరపై విస్తృత ప్రచారం చేస్తున్నారన్నారు. కాలేజీల్లో, ఆశ్రమాల్లో, హాస్పటల్లో వివిధ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందుకు గాను శివకుమార్ను జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా నియమించామని  తెలిపారు. ముంజంపల్లి నియామకంపై పలువురు డాక్టర్లు, ఫార్మసిస్టులు, వివిధ బీసీ సంఘాల నాయకులు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, పలు రాష్ట్రం తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!