
కురువంశ నిత్యాన్న దాన సత్రం అభివృద్ధికి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.. ఎంపీ
కర్నూలు, న్యూస్ వెలుగు: భారత కురువంశ నిత్యాన్న దాన సత్రం అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం ఉన్న 56 గదులను 100 గదుల నిర్మాణం కోసం కావాల్సిన అనుమతుల విషయం లో పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ బస్థిపాటి నాగరాజు తెలిపారు.శివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆదివారం శ్రీశైలం చేరుకున్నారు. దర్శనం తర్వాత ఆయన కురువ సంఘ సత్రం చేరుకున్నారు. కురువ సంఘం సత్రం తో పాటు అన్నదాన కార్యక్రమాన్ని సందర్శించి 4 వ రోజు అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు.సత్రం లోని సదుపాయాలు చూసి సంతోషం వ్యక్తం చేశారు.గత 4 రోజుల నుండి రోజుకు దాదాపు 8,000 మందికి పైగా ఉచిత భోజనం అందిస్తున్న విషయం తెలిసి ఆశ్చర్య పోయారు.అన్నదాన కార్య్రమాన్ని ఇదేవిధంగా కొనసాగించాలని ఆయన కోరారు.తర్వాత సత్రం ఆవరణ లో ఆంధ్ర,తెలంగాణ నుండి వచ్చిన భక్తులను ఉద్దేశించి ఎంపీ మాట్లాడారు. కర్నూలు జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. కురువ సంఘం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ తెలిపారు. కురువలు సమాజంలో అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరారు.ముఖ్యంగా మీరు మీ పిల్లల ఉన్నతి కోసం మంచి చదువులు చదివించాలని కోరారు .ప్రభుత్వ సహకారంతో ఎలాంటి పనులు కావాలన్న నేను దగ్గర ఉండి చేపిస్తానన్నారు. గతంలో కూడా కర్నూలు జిల్లా పరిధిలోనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం గుడిసె శివన్న నన్ను కర్నూలు లో కలవడం జరిగింది. ప్రజా సమస్యలు ఉంటే సంఘాల ప్రతినిధులు తెలుపాలన్నారు.వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షులుఎం. కె.రంగస్వామి, సభ్యులు గుడిసె శివన్న కూడా మాట్లాడారు. వీరు ఎంపీ గారి సహకారం కోరడం తో ఆయన పై విధంగా హామీ ఇచ్చారు.నిత్యాన్న దానం కోసం వస్తువులు సేకరించినారని ఎమ్మిగనూరు కు చెందిన అంపయ్య, ఉరుకుందు,వీరన్న లను అభినందించి, ఎంపీ నాగరాజు సత్కరించారు. అదే విధంగా గత 4 రోజుల నుండి అన్నదానం కోసం వంటలు చేసి భక్తులకు,సరఫరా చేసి పూర్తి సేవలు అందించిన పర్ల గ్రామానికి చెందిన,మహానంది,మల్లికార్జున,నాగన్న, రాముడు,జయరాముడు, చిన్న బుడ్డన్న, గోపాల్,రామకృష్ణ, తో పాటు సేవలందించిన వారిని అభినందించి సత్కరించారు.అటు తర్వాత కర్నూలు జిల్లా కురువసంఘం, శ్రీశైల కురువ సత్రం కమిటీ తరుపున ఎంపీ నాగరాజు ను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో వీరితో పాటుగా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు కూడా పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమం లో సత్రం ప్రెసిడెంట్ ఎం. కె.రంగ స్వామి,సభ్యులు గుడిసె శివన్నతో పాటు,ప్రధానకార్యదర్శి అల్లూరు వెంకటేశ్వర్లు,కోశాధికారి వెంకటేశ్వర్లు,ఉపాధ్యక్షులు శ్రీనివాసులు,మహేష్,ఉప కార్యదర్శి ప్రసాద్, సభ్యులు నాగన్న,నాగశేషులు,శివ,బీరప్ప,తో పాటు, ఆఫీసు సిబ్బంది హరికృష్ణ తిమ్మయ్య,సుబ్బయ్య, ఉభయ రాష్ట్రాల భక్తులు పాల్గొన్నారు.


