
తెలుగు ప్రజల గుండె చప్పుడు నందమూరి తారకరామారావు
సర్పంచ్ సలహాదారులు ఎస్ ప్రతాప్ యాదవ్
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి : తుగ్గలి మండల పరిధిలోని బొందిమడుగుల గ్రామంలో పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ యండ చౌడప్ప నేతృత్వంలో సర్పంచ్ సలహాదారులు సలీంద్ర ప్రతాప్ యాదవ్ ఆద్వర్యంలో గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశంపార్టీ నాయకులు సర్పంచ్ సలహాదారులు ఎస్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు తెలుగు ప్రజల అర్ధాకలి తీర్చేందుకు,పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆనాడు మార్చి 29వ తేది 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న మహా నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావని,ఆయన పరిపాలన కాలంలో పేద ప్రజల సమస్యలను తీరుస్తూ అప్పట్లో కిలో మూడు రూపాయలు ఉన్న బియ్యాన్ని రెండు రూపాయలకు తగ్గించి పేద ప్రజల అర్ధాకలి తీర్చిన మహనీయుడిని ఈరోజు స్మరించుకోవడం సంతోషంగా ఉన్నదని,అదే విధంగా 1987 సంవత్సరంలో గ్రామాలలో కరణం పద్ధతిని రూపుమాపి స్థానిక సంస్థలకు మండల సంస్థలకు ఎన్నికలు తెచ్చిన ఘనత నందమూరి తారకరామారావుకి దక్కిందని,కాంగ్రెస్ పెద్దలు తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని డిల్లి పెద్దల చేతిలో తాకట్టు పెట్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఆనాడు పార్టీని స్థాపించి తెలుగు ప్రజల కష్టుఖాలను చూసి తెలుగు ప్రజల కన్నీటి కష్టాలను తీర్చి,వితంతువులు,వృద్ధాప్య పింఛన్లు అమలు చేసిన సంక్షేమ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావని ఆయన తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని తెలియజేస్తూ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,పత్తికొండ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ అడుగుజాడల్లో నడుస్తూ వారి నాయకత్వాన్ని అంది పుచ్చుకుని తెలుగుదేశం పార్టీకు,పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బొందిమడుగుల తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ వెంకట రాముడు,బూత్ ఇంచార్జీ వీరేంద్ర,దుబ్బ కాశీం,నడిపి హుసేన్,నాగేష్,తెలుగు సుంకన్న, మల్లీకార్జున,వెంకట రాముడు,మస్తాన్, మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.