మాజీ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన నారాయణ నాయక్

మాజీ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన నారాయణ నాయక్

తుగ్గలి న్యూస్ వెలుగు:  తుగ్గలి మండలం జాప్లా తాండ గ్రామానికి చెందిన నారాయణ నాయక్ ను వైఎస్ఆర్ పార్టీ ఎస్టీ సెల్ రాయలసీమ జోనల్ విభాగం అధ్యక్షులుగా,తుగ్గలి దివ్యాంగుల విభాగం అధ్యక్షునిగా లక్మా నాయక్ ను వైఎస్ఆర్సిపి కేంద్ర కమిటీ ఎన్నిక చేసింది.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సోమవారం రోజున కర్నూలులో గల పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ను మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు.తమపై నమ్మకం ఉంచినందుకు శక్తివంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నూతన అధ్యక్షులు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ వైఎస్సార్సీపీని మరింత పటిష్టం చేసేందుకు కార్యకర్తలు, నాయకులతో సమష్టిగా కృషి చేయాలని,అలాగే కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జిట్టా నాగేష్ యాదవ్, జడ్పీటీసీ పులికొండ నాయక్,రాము నాయక్,సుధాకర్ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి, లక్ష్మణ స్వామి,ఆనంద్ మరియు తుగ్గలి మండలం వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!