నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు ఆదర్శం
బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద
హోళగుంద,న్యూస్ వెలుగు: భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు ఆదర్శమని బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బళ్ళారి శరణ పాటిల్,అద్వాల శేషి రెడ్డి హాజరయ్యారు.అనంతరం ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా బిజెపి నేషనల్ కౌన్సిల్ నెంబర్ చిదానంద మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశానికి కాకుండా ప్రపంచ దేశానికి గొప్ప నాయకుడిగా ఎదిగి ప్రపంచంలోనే ఆదర్శ నాయకుడిగా ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలిచారన్నారు.ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ,కేజీబీవీ కళాశాల ప్రిన్సిపల్ దివ్య భారతి,జిల్లా వైస్ ప్రసిడెంట్ సుధ,బిజెపి సీనియర్ నాయకులు అనుపమ బిశ్వాస్,జక్కన్నచారి,మండల అధ్యక్షులు ప్రసాద్,ఉపాధ్యక్షులు వీరేష్,ప్రధాన కార్యదర్శి మహేష్,ఉలిగన్న,కిసాన్ మోర్చ కార్యదర్శి రామలింగ,మల్లయ్య,వెంకటేష్,యువ నాయకులు బసవ,యంకప్ప,దుర్గప్ప,రంగస్వామి,బెనకప్ప,రామాంజినేయులు,వెంకట్ రెడ్డి,బిజెపి కార్యకర్తలు,కళాశాల విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.