ఇందిరాగాంధీ మెమోరియల్ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవం

ఇందిరాగాంధీ మెమోరియల్ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవం

కర్నూలు, న్యూస్ వెలుగు; ఇందిరాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కర్నూలు నందు “జాతీయ బాలికా దినోత్సవం” సందర్భంగా “బాలికా సాదికారత – ఉజ్వల భవిష్యత్తు” అనే నినాదంతో జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాదిఖారి డాక్టర్ పి శాంతికళ ఆద్వర్యంలో ఆడపిల్లలను రక్షిద్దాం – ఆడపిల్లలను చదివిద్దాం ( బేటి పడావో – బేటి బచావో ) మరియు కిషోర భాలికల లో ఫోషకాహార ప్రాముఖ్యత అనే అంశాల పై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడమైది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదిఖారి డాక్టర్ P.శాంతికళ మాట్లాడుతూ లింగ నిష్పత్తి నందు అసమతుల్యత వల్ల వచ్చే నష్టాల గురించి వివరించారు , ప్రతి భాలిక లక్ష్యముతో ముందుకు వెళ్ళాలని , అంతేకాకుండా ఆడపిల్లలు చదువు కోవడం వల్ల వారు ఆర్ధిక స్వావలంబన సాదించి వారికి ఉజ్వల భవిష్యత్తు సాకారం అవుతుందన్నారు. కాబట్టి ఆడపిల్లలను పుట్టనిద్దాం, బ్రతనిద్దాం, చదవనిద్దాం మరియు ఎదగనిద్దాం అని పిలుపునిచ్చారు .DIO డాక్టర్ నాగప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానమే, స్త్రీ పురుషుల మద్య ఏ వివక్షా ఉండకూడదు నిజానికి పురుషుడి కంటే స్త్రీ ఏ విషయం లోనూ తక్కువకాదని తెలిపారు. అందుకే ఈనాడు అన్ని రంగాలలోను స్త్రీలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో డెమో శ్రీనివాసులు శెట్టి , డిప్యూటీ డెమో చంద్రసేకర్ రెడ్డి ఆరోగ్య విద్యా భోధకులు పద్మావతి , PC PNDT Act మానిటరింగ్ కన్సల్టెంట్ సుమలత , పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివప్రసాద్, ప్రోజెక్సనిస్ట్ ఖలీల్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!