
నేషనల్ హైవే పనులను వేగవంతం చేయాలి
అమరావతి,న్యూస్ వెలుగు ; రోడ్లు-భవనాల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. పాత్ హోల్స్ పూడ్చేందుకు మరో రూ.290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సిఎం తెలిపారు. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలని సిఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్వోబీల పూర్తికి భూసేకరణ కోసం అవసరమైన రూ.42 కోట్ల నిధులు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో రూ.65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి బిసి జనార్థన్ రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist