ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులే మానవాళి ఆరోగ్యానికి రక్ష…

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులే మానవాళి ఆరోగ్యానికి రక్ష…

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి…

భూమి సారవంతంగా ఉండే చర్యలు చేపట్టాలి…

జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య…

కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రకృతి వ్యవసాయం పై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని , ప్రకృతి వ్యవసాయమే మన ఆరోగ్యానికి రక్ష అని జిల్లాస్థాయి ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ పంటలు2025-26 సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య తెలియజేశారు. గురువారం ఉదయం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయం మరియు అనుబంధ శాఖల తో ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక 2025-26 రైతు సాధికార సంస్థ- ప్రకృతి వ్యవసాయం పై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… ఇపుడు వ్యవసాయం ఖరీదైన క్రిమిసంహార మందులు మరియు ఎరువులతో జరుగుతున్నది అని దీనివల్ల ఆ విష ప్రభావం ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయలు మరియు ఆహార దినుసులలో కి ప్రవేశిస్తున్నది. ఆ విధమైన ఆహారాన్ని మనము తీసుకోవడము వలన మన ఆరోగ్యం వివిధ అనారోగ్యాల వలన చెడిపోతున్నది. అలాగే నేల కూడా విషతుల్యమై పంటలు సరిగా పండని నిస్సారమైన భూములుగా మారిపోతున్నాయి. దీన్ని నివారించడానికి మనము ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేశారు. కావున అన్ని వ్యవసాయ శాఖలకు చెందిన సిబ్బంది గ్రామస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి వారికి కావలసిన విషయపరిజ్ఞానాన్ని అందజేసి వారు తక్కువ ఖర్చుతో జీవామృతాలు మరియు మంచి విత్తనాలతో పంటలు పండించే విధానాన్ని రైతులకు అందజేయవలసిందిగా కోరారు. జిల్లా లో ఎంత మంది రైతులు ఉన్నారు , ఎంతమంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అన్న వివరాలు సేకరించుకొని ప్రకృతి వ్యవసాయం చేయడానికి అందరిని ప్రేరేపించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రకృతి వ్యవసాయం చేసే చర్యలు ముఖ్యంగా వివరించి ప్రోత్సహించవలసిందిగా కోరారు.అంతకుముందు జిల్లా వ్యవసాయ అధికారిని వరలక్ష్మి మాట్లాడుతూ… 2016లో రైతు సాధికారత సంస్థను ప్రారంభించారు. అప్పటినుండి రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయటం, నీటిని పొదుపుగా వాడటం, విత్తనం నాటిన నుండి తిరిగి విత్తనం ఉత్పత్తి వచ్చేంతవరకు తీసుకోవలసిన చర్యలు, సూచనలు ప్రకృతి వ్యవసాయంలో ప్రదర్శిస్తూ విషరహితమైన వ్యవసాయ ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా సిబ్బంది కృషి చేస్తున్నారని, అది కొనసాగిస్తూ ఇప్పుడు ఆ సంఖ్యను గణనీయంగా పెంచే చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందిని కోరారు.ఈ సమావేశాన్ని పురస్కరించుకొని డి ఆర్ డి ఎ పిడి రమణారెడ్డి మాట్లాడుతూ… ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇప్పుడు ప్రచారం చేస్తూ గ్రామీణ ప్రాంతాలలో గణనీయంగా ప్రకృతి వ్యవసాయదారుల సంఖ్యను పెంచుకోవడం చాలా అవసరం అని తెలియజేశారు. గతంలో అధిక ఉత్పత్తుల కొరకు కెమికల్స్ వాడి నేలను నిస్సారవంతం చేశామని ఇప్పుడు సరిదిద్దుకోవలసిన అవసరం ఏర్పడిందని అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారని తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమం గ్రామం స్థాయిలో చేసి అతి తక్కువ పెట్టుబడులతో ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా సిబ్బంది కృషి చేయాలని కోరారు. కర్నూలు జిల్లాలో 1,15,000 మంది మహిళా సంఘం సభ్యుల వారిని పెరటి తోటలు (కిచెన్ గార్డెన్స్ )వైపు ఆకర్షించే లక్ష్యాన్ని చేరుకోవాలని అందుకు అందరూ కృషి చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో తడకనపల్లె కు చెందిన జుబేదా బేగం ప్రకృతి వ్యవసాయం(పాల ఉత్పత్తులు )మరియు ఉల్లిపాయల ప్రాసెసింగ్ ద్వారా నెలకు దాదాపు 50 వేల రూపాయలు , గూడూరు కు చెందిన బత్తిన లక్ష్మి దాదాపు 40 వేల రూపాయలు సంపాదిస్తున్నట్టు తెలిపారు .బత్తిన లక్ష్మి ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు మార్కాపురం సభలో సన్మానించారు. చాకలి పుల్లయ్య నేషనల్ వైడ్ అవార్డు సాధించారు. మల్లికార్జున న్యాచురల్ ఫార్మింగ్ మార్కెటింగ్ వలన బెంగుళూరు మిల్లెట్ & ఆర్గానిక్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ సమావేశానికి హాజరయ్యారు. వీరిని జిల్లా జాయింట్ కలెక్టర్ అభినందించారు.ఈ సమావేశానికి ఏపీఎంఐపి పిడి ఉమామహేశ్వరమ్మ, హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు, డిడి ఫిషరీస్ శ్యామల, ఏడి మార్కెటింగ్ నారాయణమూర్తి, అగ్రికల్చర్ ఆఫీసర్ లక్ష్మయ్య, డిఎల్ఎంపి, అగ్రికల్చర్ ఆఫీసర్లు, డిఆర్డిఏ ఏపీడీలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!