
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; నాన్ కమ్యూనికబుల్ డిసీజర్( ఎన్. సి .డి) సర్వే కార్యక్రమాన్ని ఒంటిమిట్ట మండలంలో ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఒంటిమిట్ట ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారిణి హిమశ్వేత మంగళవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ .సి.డి. కార్యక్రమం ద్వారా మండలంలోని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరుగుతుందని తెలియజేసింది.18 సంవత్సరములు నిండిన స్త్రీ పురుషులకు స్కానింగ్ చేయడం జరుగుతుందని ఈ సర్వే ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ బారిన పడిన వ్యాధిగ్రస్తులను కనుక్కోవడం జరుగుతుందని తెలిపింది. వ్యాధిగ్రస్తులు తెలుసుకోలేక ముదిరిపోయిన తర్వాత డాక్టర్ వద్దకు వెళ్తున్నారని వారిని డాక్టర్లు కాపాడలేకపోతున్నారని మరణం సంభవిస్తుందని కావున తాము ఇంటింటి సర్వేలో తీసిన స్కానింగ్ ద్వారా ముందుగానే కనుక్కోవచ్చన్నారు. ఆ వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకొని అనుభవం కలిగిన డాక్టర్లకు సిఫారసు చేస్తామన్నారు. కావున ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొని క్యాన్సర్ వ్యాధిన పడకుండా తాము ఇచ్చే సూచనలను పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు తెలియజేశారు. ఈ సర్వేలో నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ కాన్సర్ మరియు బీపీ, షుగర్, హెచ్ బి తదితర పరీక్షలు నిర్వహించబడుతుందని తెలియజేసింది.
-
Y.Bala guru natha sarma , Vontimitta kadapa District devotional writings
View all posts
Thanks for your feedback!