
యువతలో మూత్రసమస్యలకు ఏఐఎన్‌యూలో సరికొత్త పరిష్కారం
ఔట్ పేషెంట్ పద్ధతిలో వెసులుబాటు
సిగ్గుతో బస్సులు కూడా ఎక్కలేని పరిస్థితి
హైదరాబాద్, న్యూస్ వెలుగు: ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు మూత్ర సంబంధిత
పీబీఎన్ఓ సమస్య ఉన్నవారు చాలా ఇబ్బంది పడతారు. సాధారణంగా పురుషులు రోజులో నాలుగైదు సార్లు మూత్రానికి వెళ్తే, ఈ సమస్య ఉన్నవారు ప్రతి గంటకీ వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మూత్రవిసర్జన చేయడానికి ఇబ్బంది పడతారు. పూర్తిగా అయినట్లు అనిపించదు. దాంతో సమావేశాల్లో పాల్గొనాలన్నా, బస్సులు ఎక్కాలన్నా సిగ్గుతో ఇబ్బంది పడతారు. సహజంగా ఉండే సిగ్గు వల్ల వైద్యుల వద్దకూ వెళ్లరు. ఎక్కువసేపు అలా మూత్రం లోపలే ఉండిపోవడంతో కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. పశ్చిమగోదావరి కేసులో సమస్యను వెంటనే గుర్తించి, ఐటీఇండ్ పరికరం అమర్చడంతో అతడి సమస్య మొత్తం పరిష్కారమైంది. దీన్ని ఔట్‌పేషెంట్ విభాగంలోనే అమరుస్తారు, అదేరోజు వెళ్లిపోవచ్చు. చిన్నపాటి లోకల్ ఎనస్థీషియా ఇస్తే సరిపోతుంది కాబట్టి హృద్రోగులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికీ ఇబ్బంది ఉండదు. ఇది అమర్చడం వల్ల మచ్చలు, కుట్లు కూడా ఉండవు. ఐటీఇండ్ పరికరం ప్రోస్టేట్‌ను, బ్లాడర్ నెక్‌ను తెరుస్తుంది. దీనివల్ల గ్రంధి పొడవునా ఒక ఛానల్ ఏర్పడుతుంది. తర్వాత ఐదు నుంచి ఏడు రోజుల్లో మొత్తం బ్లాక్ అయిన ప్రాంతాన్ని ఇది తెరుస్తుంది. దీనివల్ల లైంగిక సామర్థ్యం తగ్గడం అనే దుష్ప్రభావం ఉండదు. సంప్రదాయ చికిత్సల్లో ప్రోస్టేట్‌ను కొంత తొలగిస్తాం. అందువల్ల వీర్యస్ఖలనం సామర్థ్యం పోవచ్చు. ఐటీఇండ్‌లో కోతలే ఉండవు కాబట్టి, లైంగిక సామర్థ్యం యథాతథంగా ఉంటుంది” అని డాక్టర్ విజయ్‌కుమార్ శర్మ వివరించారు.