ఉక్కు ఫ్యాక్టరీ పనులు ప్రారంభించకపోతే ఆందోళన తప్పదు: సిపిఎం
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు సిపిఎం పట్టణ మహాసభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రామ్మోహన్, బి. మనోహర్ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం పట్టణ మూడవ మహాసభల సందర్భంగా ర్యాలీ ప్రదర్శన జరిగింది. అనంతరం మహాసభ ప్రతినిధుల మహాసభ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. మనోహర్ , ఏ.రామ్మోహన్ , హాజరై వారు మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజవర్గంలో ఉక్కు ఫ్యాక్టరీ శిలాఫలకాలకే పరిమితమైందని వారు తెలిపారు. ఎన్నికల ముందు పాలకులు ఒక్క ఫ్యాక్టరీ కోసం ప్రారంభిస్తామంటున్నారే గానీ ఇంతవరకు అతిగతి లేదని వారు తెలిపారు జమ్మలమడుగు నియోజవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి కోసం రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడుతున్నట్లు వారు తెలిపారు. గండికోట నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని వారు ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని వారు తెలిపారు. పాలక ప్రభుత్వాలు విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో ప్రజలపై బాలాలు చేస్తున్నారని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పనిచేస్తుందని వారికి తెలిపారు ఈ మహాసభలు గత మూడు సంవత్సరాల కాలంలో పార్టీ చేసిన పోరాటాల ఉద్యమాలను సమీక్షించి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడం జరిగిందన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి , పాల్గొనడం. అనంతరం నూతన పట్టణ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. సిపిఎం పట్టణ నూతన కార్యదర్శి జి ఏసుదాసు, పట్టణ కమిటీ సభ్యులు ఏ. వినయ్ కుమార్, డి.విజయ్, వై నరేంద్ర, కే కుమార్, హుస్సేన్ వలి, రాజు, పార్టీ సభ్యులు వై అబ్రహం కమల్ భాష , దివాకర్, మోష ,మన్సూర్ , దస్తగిరి, రమేష్, నన్నే , విజయ్ పాల్గొనడం జరిగింది.