
పాఠశాల విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించిన NSS యూనిట్ 5 విద్యార్థులు
కర్నూలు, న్యూస్ వెలుగు : ,రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్థానిక నూతనపల్లె గ్రామం లో ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ లో భాగంగా మూడవ రోజు ఎన్ఎస్ఎస్ యూనిట్ 5 ప్రోగ్రామ్ ఆఫీసర్ బి. వి. శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యం లో పాఠశాల విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి వారి గ్రూపు నిర్ధారించటం జరిగింది. మరియు విద్యార్థులకు గుడ్ టచ్ అండ్ బాడ్ టచ్ మీద అవగాహన, పిల్లలలో పోషకాల లోపం, మహిళలు పిల్లల సంక్షేమం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందిస్తూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు గ్రామంలో చేయాలని సూచించడం జరిగింది. ఎన్ఎస్ఎస్ శిబిరం లో కార్యక్రమాలను రాయలసీమ యూనివర్సిటీ ఎన్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ పి నాగరాజు తనిఖీ చేయడం జరిగింది. మరియు ప్రోగ్రాం ఆఫీసర్ ను, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించడం జరిగింది. చివరగా రక్త పరీక్షలు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ రంగాచారి ని ప్రోగ్రాం ఆఫీసర్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్కరించడం జరిగింది.

