కోదండరామస్వామిని దర్శించుకున్న రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి

కోదండరామస్వామిని దర్శించుకున్న రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి

న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; రెండవ అయోధ్య ఆంధ్ర భద్రాచలం ఏకశిలానగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడ. విజయ శేఖర్ రెడ్డి సతీ సమేతంగా సందర్శించారు. సతీ సోదర సమేతంగా శ్రీ కోదండ రామస్వామి గరుత్మంత వాహనంపై ఉత్తర ద్వారం వద్ద కొలువు తీరి ఉండగా ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించి వారి వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆనందభరతులయ్యాడు. అనంతరము స్వామివారికి అభిముఖంగా వెలిసిన వరదాభయ భక్త సంజీవరాయ స్వామి దర్శనార్థం ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఏర్పాటుచేసిన భక్తుల అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ గాదె. శివకుమార్, అడ్వకేట్ గాదె. ఆదినారాయణ, మోదుగుల. నరసింహులు, మామిడి. మదన్ మోహన్ రెడ్డి, దున్నతల .రఘురామిరెడ్డి తదితరులు ఉన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!