25న ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ వో కార్యాలయం దగ్గర ధర్నా
వెంటనే అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం కింద 20 వేలు ఇవ్వాలి
సిసిఆర్ సి కార్డులు పొందిన ప్రతి కౌలుదారులకి పెట్టుబడి సాయం అందచేయాలి
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు తెచ్చిన జీవో నెంబర్ 22 రద్దు చేయాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద 20 వేల రూపాయలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని చెప్పేసి తెలుగుదేశ కూటమి ప్రభు త్వం హామీ ఇచ్చినందుకు రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. అట్లాగే కేంద్ర బిజెపి ప్రభుత్వ ఒత్తిడితో గత ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు జీవో నెంబర్ 22 తెచ్చింది మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తే కల్లూరు మండలంలోని ఉలిందకొండ గ్రామంలో తాండ గ్రామాలలో రైతులు తిప్పి కొట్టారు రైతులకు అండగా రైతు సంఘాలు నిలబడ్డాయి తెలుగుదేశం పార్టీ కూడా రైతులకు మద్దతు తెలిపింది ప్రస్తుతం మంత్రిగా ఉన్న లోకేష్ బాబు ఆనాడు మీటర్లను పగలగొట్టమని పిలుపునిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అనుసరించడం సరైనది కాదు మోటర్లకు మీటర్లు పెట్టే విధానం మీటర్లు తయారు చేసే ఆదాని కంపెనీకి తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు కనుక జీవో నెంబర్ 22 రద్దు చేయాలి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలి అట్లాగే సిసిఆర్ సి కార్డులు పొందిన ప్రతి కౌలుదారులకి పెట్టుబడి సాయం కోసం 20 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. దేవాదాయ భూములకు అట్లాగే ముస్లిం ఇనాం భూములకు కౌలు చేసేటటువంటి కౌలు దారులకు సిసిఆర్సి కార్డులు ఇవ్వాలన్నా బ్యాంకులో పంట రుణాలు ఇవ్వాలన్న పంట నమోదు చేయాలన్న ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రభుత్వమే పరిష్కార మార్గం చూపాలని కోరారుఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్నికల్లూరు మండలంలోని బొల్లవరం, దూపాడు గ్రామ సచివాలయాలోని అగ్రికల్చర్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇదే డిమాండ్లతోని ఈనెల 25వ తేదీన కల్లూరు మండల తహసిల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం గా నిర్వహిస్తుందని పార్టీలకు అతీతంగా రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్ల నాగశేషులు కట్టెల వెంకటరాముడు మాదిగ సుదర్శనం బోనపల్లె మహేష్ తదితరులు పాల్గొన్నారు.