విస్తృత స్థాయిలో ఆప్టా సభ్యత్వ నమోదు కార్యక్రమం
కర్నూలు, న్యూస్ వెలుగు: నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎం మధుసూదన రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సేవాలాల్ నాయక్ అధర్వ్యంలో ఎమ్మిగనూరు మండలంలో బనవాసి, కోటేకల్, చెన్నపురం, దేవిబెట్ట, బోడబండ మొదలైన గ్రామాల యందు వున్న పాఠశాల లో ఆప్టా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయబడింది.ఈ సందర్బంగా పై గ్రామాల యందు పని చేయుచున్న ఉపాద్యాయ సిబ్బంది అందరూ ఆప్టా సభ్యత్వం తీసుకున్నారు. ఆప్టా సంఘం నాయకులు ఉపాధ్యాయ సమస్య ల పై చేస్త్తున్న విస్తృత ప్రాతినిథ్యం ల వలన అనేక సమస్య లు తీరుతున్నాయి అని ఉపాద్యాయులు ప్రశంసించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతు ఉపాద్యాయులు తమ యొక్క సమస్యల పరిష్కారం కొరకు కర్నూలు కు రావాల్సిన అవసరం లేదు అని వారు తమ యొక్క సమస్య లను ఫోన్ ద్వారా చెప్పిన పరిష్కారం చేస్తాం అని , జిల్లా అధ్యక్షుడు అయిన తన నంబర్ 9704040543 కి కానీ జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా లాల్ నాయక్ 9550855099 కు 24 గంటల లో ఎప్పుడైనా సంప్రదించవచ్చు అని చెప్పారు.ఈ కార్యక్రమము లో ఆ ప్టా రాష్ట్ర నాయకుడు గోపాల్ కుడా పాల్గొనడం జరిగింది.