
ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; కడప జిల్లా కేంద్రం ఎర్రముక్కపల్లె లోని నవీన్ న్యూరో కేర్ హాస్పిటల్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నవీన్ ప్రసాద్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఒంటిమిట్ట జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం మండల ప్రజల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న సమాజంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు జీవిస్తున్నారని పూట గడిచేందుకు ఇబ్బందుల పడుతున్న ప్రజల సౌకర్యార్థం వైద్యం చేయించుకునేందుకు స్తోమత లేని వారి సౌకర్యార్థం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తలనొప్పి, మూర్ఛ, వణుకుడు, కంపవాతము, మతిమరుపు, వింత ప్రవర్తన , నరముల బలహీనత, నడుము నొప్పి, తిమ్మర్లు, తలనొప్పి, మంటలు, కళ్ళు తిరగడం, నిద్ర లేకపోవడం, చిన్నపిల్లల ఎదుగుదల లోపము, బుద్ధి మాంద్య పిల్లలకు చికిత్సలు తమ ప్రత్యేకత అన్నారు. కావున మండల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన తెలియజేయడం జరిగింది. ఉదయం 9:00 గంటల నుంచి 12 :00గంటల సమయం వరకు ప్రతి ఒక్కరికి చికిత్సలు నిర్వహించడం జరుగుతుందన్నారు.