
పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; ఎస్పీ ఆదేశాల మేరకు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన జమ్మలమడుగు సబ్ డివిజన్ ఇంచార్జ్ డిఎస్పి రమాకాంత్ రక్తదాన శిబిరం నందు జమ్మలమడుగు అర్బన్ సీఐ లింగప్ప , జమ్మలమడుగు రూరల్ సిఐ గోపాల్ రెడ్డి, కొండాపురం సిఐ రఫీ గారు, కలమల ఎస్ఐ తిమోతి , మెడికల్ ఆఫీసర్ శ్రీలత ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు టౌన్ కు చెందిన ప్రజలు రాజకీయ నాయకులు సిబ్బంది రక్తదానం చేసినారు. ఇప్పటివరకు 50 మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.
Was this helpful?
Thanks for your feedback!