
పాడి పంటలు మాస పత్రిక పుస్తకం రైతులకు ఓ మంచి నేస్తం ఒక వరం లాంటిది..
మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి
ప్రతి రైతు వార్షిక చందా 300 రూపాయలు చెల్లించి ప్రతి ఇంట నెల వారి మాస పత్రిక పుస్తకం పొందాలి
ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండల రైతు సోదరులకు నమస్కారం మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి రైతు సోదరులకు తెలియచేయడం ఏమనగా మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ తరుపున పాడి పంటలు అనే నెల వారి మాస పత్రిక పుస్తకం కావాల్సిన రైతులు సంవత్సరం చందా 300 రూపాయలు కట్టవలెను అని కోరారు.ఈ పుస్తకం లో ప్రతి నెల రాష్ట్రంలో మరియు ఇతర రాష్టాలల్లో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వ్యవసాయానికి సంబంధించిన నూతన పద్ధతులు ,అలాగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను ముద్రించి ప్రతి నెల వ్యవసాయ శాఖ ద్వారా పుస్తకమును మీ ఇంటికే అందిచడం జరుగును అని తెలిపారు. ప్రతి రైతు వ్యవసాయములో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి, ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా చేపట్టవలసిన మెళకువలు,సలహాలు,సూచనలను ప్రతి నెల వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, మరియు వ్యవసాయ అధికారులు రైతులకు మట్టి నమూనాల సేకరణ ఆవశ్యకత,వివిధ పంట సాగు కు నేలల ఎంపిక,నూతన వంగడాలు ఎంపిక, విత్తన శుద్ధి విధానం ,ఆవశ్యకత, వ్యవసాయ పనిముట్లు,వాటి వాడకం,పంట నూర్పిడి యంత్రాలు, పని తీరు,పంట నమోదు మరియు ప్రాముఖ్యత, సూక్ష్మ పోషకాల ప్రాధాన్యత,పొలం బడి,పొలము పిలుస్తోంది ,విత్తన పంపిణీ,గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకం,చిరు సంచులు పథకం,(మినీ కిట్స్) ,సూక్మ సేద్యం,(బిందు సేద్యం, స్ప్రింక్లర్లు ,రైన్ గన్లు ,అలాగే వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేసే వివిధ రకాల పథకాల గురించి,మరియు ఉద్యాన శాఖ పంటలు, పథకాల గురించి అవగాహన,పాడి పరిశ్రమ, బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం వంటి అంశాలను ఈ మాస పత్రిక పుస్తకం ద్వారా అందిస్తున్నారు.కావున ప్రతి రైతు ఈ సదవకాశమును సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి రైతు సోదరులకు తెలిపారు.చందా కట్టుటకు ఆసక్తి ఉన్న రైతులు మీ సమీప రైతు సేవా కేంద్ర సిబ్బందికి డబ్బులు చెల్లించి మీ వివరాలు వారికి ఇవ్వాలని కోరారు.


 Ponnathota Jayachandra
 Ponnathota Jayachandra