రాష్ట్రస్థాయి పోటీలకు పగిడిరాయి విద్యార్థి ఎంపిక
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: జిల్లా కేంద్రమైన కర్నూలు నందు అవుట్ డోర్ స్టేడియంలో జరిగిన వాలీబాల్ అండర్ 17 బాలుర విభాగం పోటీలలో పగిడిరాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం.హర్షిత్ సన్నాఫ్ ఎం.గుండమ్మయ్య స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.ఈనెల 21 నుంచి 23 వరకు అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ వేణు తెలియజేశారు.విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిడ్డమ్మ,ఫిజికల్ డైరెక్టర్ వేణు,ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Was this helpful?
Thanks for your feedback!