గ్రీవెన్స్ డే పలు సమస్యలపై కలెక్టర్ కలిసిన పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
కర్నూలు, న్యూస్ వెలుగు; సోమవారం 02-12-2024 న గ్రీవెన్స్ డే సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పీ రంజిత్ భాష కలిసి కల్లూరు మండలం కొంగణ పాడు గ్రామం లో గ్రామ టీడీపీ కార్యకర్త మాజీ సర్పంచ్ నాగయ్య గత సంవత్సరం జనవరి లో మిరప పంట దాదాపు 30 లక్షల విలువగల పంట వైసిపి ముకలు ప్రెట్రోల్ పోసి అంటించడం జరిగింది,అప్పటిలో నారా చంద్రబాబు నాయుడు దృష్టికి గౌరు చరిత రెడ్డి తెలియజేయడం తో చంద్రబాబు పంట నష్టం అందజేస్తాం అని రైతుకు భరోసానిచ్చారు,మరియు ఓర్వకల్లు మండలం భైరాపురం గ్రామ రైతులు గతం నుండి పొలాలు సాగు చేసుకుంటున్నారు రైతులకు పాసు పుస్తకలు ఉన్న ఆన్లైన్ ఎక్కీయడం లేదు అని ఎమ్మెల్యే చరిత రెడ్డి దృష్టికి రైతులు తీసుకురావడం తో ఈరోజు సునయన ఆడిటోరియంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లాలని పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కొంగణపాడు,భైరపురం సమస్యలపై వినతి పత్రం అందజేశారు