మండలంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

మండలంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; క్షేత్రస్థాయి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక నాయకులు శ్రీ కోదండ రామాలయ వెనుక భాగం వద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటరీ ఇంచార్జ్ సుగవాసి. బాలసుబ్రమణ్యం హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు పుష్పగుచ్చములతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ మూల స్తంభాలుగా నిలవాలని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఒక పునాదిగా నిలవాలన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అన్ని రంగాల్లో పటిష్టంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు సారథ్యం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒంటిమిట్ట మండలంలో 2024– 26 పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషమన్నారు. మంత్రి నారా. లోకేష్ సారధ్యంలో కార్యకర్తలే సంక్షేమంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, నీటి సంఘాలు, సొసైటీ ఎన్నికల్లో పాల్గొనాలంటే పార్టీ నమోదు అవసరమన్నారు. తప్పనిసరిగా తీసుకోవాలన్నాడు. కార్యకర్తలు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే ప్రభుత్వ బీమా పథకం 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. పేర్లు నమోదు చేసుకునే సభ్యుల నుంచి 100/ రూపాయలు మాత్రమే సభ్యత్వ రుసుము వసూలు చేయాలని శాశ్వత సభ్యత్వ రుసుముగా లక్ష రూపాయలు నిర్ణయించడం జరిగిందన్నాడు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయించి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థాయిలో ఉంచాల్సిన బాధ్యత కార్యకర్తలుదేనన్నారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతం కొరకు ఊరూరా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతూ ఒక ఉద్యమంల ముందుకు సాగాలన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని సభ్యత్వ నమోదుగా తమ పేర్లను జోడించాలన్నాడు. అనంతరం ఆయన కార్యాలయాలకు వెళ్లి కాసేపు అధికారులతో మాట్లాడి మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందు వరుసలో ఉండాలని ప్రజాభ్యుదయమే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అన్నాడు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గజ్జల .నరసింహారెడ్డి, ఎస్. వెంకటరమణ, కొత్తపల్లె. బొబ్బిలి రాయుడు, పత్తి .సుబ్బరాయుడు, ఈశ్వరయ్య, మౌలాలి, వినోద్ రెడ్డి, ప్రతాపరెడ్డి, వెంకటసుబ్బయ్య, బాలకృష్ణ, నామాల. వెంకట సుబ్బయ్య, వీరాంజనేయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!