
ఘనంగా పవిత్ర కుమార్ పదవీ విరమణ కార్యక్రమం
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు లోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న పవిత్ర కుమార్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఇన్సూరెన్స్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ పరిషత్ అధ్యక్షుడు జయమూర్తి, ప్రధాన కార్యదర్శి కృష్ణ ప్రసాద్, మురళీధర్, యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు. పదవి విరమణ చేసిన సీనియర్ అసిస్టెంట్ పవిత్ర కుమార్ ను వారు ఘనంగా సన్మానించారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులు శాలువా కప్పి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సందర్భంగా జనరల్ ఇన్సూరెన్స్ ఆలిండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ పరిషత్ అధ్యక్షుడు జయమూర్తి తదితరులు మాట్లాడుతూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో గత 36 సంవత్సరాలుగా పవిత్ర కుమార్ మెరుగైన సేవలు అందించి అందరి అభిమానాన్ని చురకొన్నాడని చెప్పారు .ఆయన పదవీ విరమణ అనంతర జీవితం ఆనందదాయకంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం పనిచేస్తుందని వివరించారు. ముఖ్యంగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన పే రివిజన్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో కృషి చేస్తున్నామని వివరించారు. ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని తెలియజేశారు.