శ్రీ దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంఅమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం ఇంద్రకీలాద్రి చేరుకొని కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొన్నారు.తోలుత అమ్మవారి ఆలయ మెట్లను శుభ్రపరిచి, మెట్ల పూజ చేశారు. అనంతరం అమ్మవారి దర్శనంనకు విచ్చేసిన ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్, ఆలయ ఈవో కెయస్ రామరావు ఆలయ మర్యాద తో స్వాగత పలికారు.ఆలయ వేదపండితులు పూర్ణకుంభం, వేదమంత్రోచ్చారాణలతో అంతరాలయం తోడ్కొని వెళ్లారు.ఆలయంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవారి ఆశీర్వచనం కల్పించి, శేషవస్త్రం, ప్రసాదాలను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆలయ ఈవో అందజేశారు.అనంతరం ఉప ముఖ్యమంత్రి వర్యులు మీడియానుద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వర్యులతో పాటుగా ఎంపీ లు కేశినేని శివనాధ్ (చిన్ని), బాలశౌరి, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ ఇతరులు ఉన్నారు.