వైసీపీ పాలనపై అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి : ఏపీలో ఐదేళ్ల పాటు పాలన కొనసాగించిన వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తు 2019లో నేరస్తులు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రాజకీయాలను నేరమయం చేసిందని విమర్శించారు.
నేరస్థులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మొన్నటి వరకు చూశామని పేర్కొన్నారు. క్రిమినల్స్ మైంట్‌సెట్‌తో ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి, రాజ్యాంగ విధానాలకు, వ్యవస్థలకు గౌరవం ఇవ్వరని విమర్శించారు. సుప్రీం కోర్టు జడ్జిలను వదలలేదు, పార్టీ కార్యకర్తలను వదలలేదని వివరించారు. సొంతపార్టీ ఎంపీని కూడా దారుణంగా హింసించిన చరిత్ర గత పాలకులదని అన్నారు.
వైసీపీ పాలకులు రఘురామరాజును మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించారు. సొంత ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమైన విషయమని అన్నారు. వైసీపీ అరాచకపాలనపై వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలనివ్వకూడదని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.