బాబు ను ప్రజలు అసహ్యించుకుంటున్నారు..!
ఎస్ వి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే , కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు
న్యూస్ వెలుగు, కర్నూలు; శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్ లో జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి , పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కే శ్రీదేవి , ఇతర నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరుగుతే ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఆమె చేసిన వాగ్దానాలలో ప్రధానమైనటువంటి అమ్మ ఒడి పథకాన్ని అవసరమమలు చేయడం లేదని వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశకుగురి కావడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు ఉన్న ఇచ్చిన మాట తప్పడం వాగ్దానాలను నెరవేర్చకపోవడం అనే బ్రాండ్ ఇమేజ్ను కొనసాగిస్తున్నాడని ప్రజలకు అర్థమైందని దుయ్యబట్టారు. వచ్చే సంవత్సరం కూడా దీని కొనసాగిస్తారని నమ్మకం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ జగనన్న పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం రద్దు చేసి ప్రజలను ఇబ్బంది గురి చేస్తుందని విమర్శించారు. వైస్సార్సీపీ అనుబంధ విభాగల పార్టీ కార్యదర్సులు కార్పొరేటర్లు మాజీ చైర్మన్ లు ఇతర నాయకులు పాల్గొన్నారు.