గ్రామాల్లోని ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించాలి
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలకు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు ను మండల కేంద్రమైన ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం సిద్ధవటం మండల నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బాలిరెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు స్థానిక నాయకులతో మాట్లాడుతూ ఇరు మండలాల్లోని గ్రామ ప్రజలు ఎటువంటి తగాదాలకు గాని ఘర్షణలకు గాని పోకుండా ప్రశాంత వాతావరణంలో జీవించాలని కుటుంబాలను పిల్లలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా మసులుకోవాలని అసాంఘిక చర్యలకు పాల్పడకూడదని అందుకు స్థానిక నాయకులు సహకరించాలని తెలియజేశారు. అదేవిధంగా గ్రామాల్లో ఏవైనా సమస్యలు గానీ ఉన్నట్లయితే తనకు గాని తన పోలీసు సిబ్బందికి గాని తెలియజేసి పరిష్కరించుకోవాలని తక్షణమే పరిష్కారం దొరుకుతుందని అంతఃకరణ శుద్ధితో ఎల్లవేళలా ప్రజల కోసం బాధ్యతలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అక్రమ రవాణాను అరికట్టేందుకు స్థానిక ప్రజలు స్థానిక నాయకులు తమకు సహకరించాలని ముందస్తు సమాచారం అందించాలని గృహ అవసరాలకు నిర్మాణాలకు మాత్రమే స్థానికులు ఇసుకను తరలించుకోవాలని ఇసుక రవాణాకు ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం షరతులు కచ్చితంగా వర్తిస్తాయని ఇందులో ఎటువంటి సందేహము లేదని ఆదేశాలను ధిక్కరించి ప్రవర్తిస్తే చట్టపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కావున ప్రజలు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.