సైబర్ నేరాలు, మోసాలపై  ప్రజలను అప్రమతం చేయాలి

సైబర్ నేరాలు, మోసాలపై ప్రజలను అప్రమతం చేయాలి

  హొళగుంద, న్యూస్ వెలుగు;   జిల్లా SP  సూచనల మేరకు సైబర్ నేరాలు, మోసాలపై  ప్రజలను అప్రమత్తము చేసి, వారికి అవగాహన కల్పించేందుకు కరపత్రాలను (pamplets) హోలగుంద పోలీస్ స్టేషన్ నందు SI బాల నరసింహులు శుక్రవారం ఆవిష్కరణ కార్యక్రమమునకు హోలగుంద ZP High school, కన్నడ స్కూల్, తనూజ డిగ్రీ కాలేజ్, సుమౌర్య డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు ఉపాధ్యాయులు, ధనుంజయ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం గోపీనాథ పోలీసు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరాలు జరిగే విధానం గురించి అవగాహన కలిగి ఉండాలని, అపరిచితుల నుండి వచ్చే వీడియో కాల్స్ కానీ, .apk లింకులకు కానీ రిసీవ్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరికి కూడా మన వ్యక్తిగత వివరాలు బ్యాంకు సంబంధించిన వివరాలు చెప్పకూడదని తెలియజేయడమైనది. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 నంబరు, పోలీస్ వారికి కాల్ చేసి తగిన సహాయం పొందాలని తెలియజేయడమైనది.

Author

Was this helpful?

Thanks for your feedback!