
ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
హొళగుంద, న్యూస్ వెలుగు; ఆదివారం పెద్దగోనెహాల్, ఎండి హళ్లి, ఇంగళిదహాల్ గ్రామాలను సందర్శించడం జరిగినది. ప్రజలు సైబర్ నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలని పరిచయం లేని కొత్త నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్ గాని, .apk లింకులకు గాని సమాధానాలు ఇవ్వకూడదని అలా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులను కోల్పోవలసి వస్తుందని తెలియజేయడమైనది. అదేవిధంగా ఇంగలద హాల్ గ్రామంలోని BC వెల్ఫేర్ హాస్టల్ ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడడం జరిగినది. హాస్టల్లో ఉండడం కొందరు పిల్లలకు బాధగానే ఉంటుందని కానీ అంతకన్నా ఎక్కువగా వారి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారని అయినా కానీ పిల్లలు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాలని, వారిలాగా కూలి పనులు చేసుకుని బ్రతకకూడదనే ఆశతో తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకొని, లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో పట్టుదలగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో SI బాల నరసింహులు గారు, ట్రైనీ SI భాష, మరియు పోలీసు సిబ్బంది పాల్గొనడం జరిగినది


 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda