రాంకొండ గ్రామంలో ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం

రాంకొండ గ్రామంలో ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం

తుగ్గలి, న్యూస్ వెలుగు; తుగ్గలి మండలం పరిధిలోని గల రాంకొండ గ్రామంలో ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం సందర్బంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పత్తికొండ శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు రాంకొండ గ్రామ పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ తుగ్గలి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మసాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాంకొండ గ్రామ పంచాయతీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో మంగళవారం రోజున మొక్కలను నాటారు.,ఈరోజు మనం నాటిన మొక్కలే రేపటి మన భవిష్యత్ జీవన ప్రమాణానికి నాంది అవుతాయని, ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ హెచ్.నాగరాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ భాగంలో చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనిభూమి మీద నివసిస్తున్న అన్ని జీవరాసులకు మొక్కలే జీవనాధారం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తుగ్గలి మండల అధ్యక్షుడు వెంకటేష్,మేటి మహేష్,బోయ చిట్యాల కాశిమ్,కొమ్ము బజారి,రాకేష్.నేరేడుజల్ల వెంకటేష్, అనిత్,అనిల్,నేరేడుజల్లా కాశినాథ్,పవన్ కుమార్ మరియు టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!