హంద్రీనీవా కాలువకు ఇరువైపులా పండ్ల మొక్కలు నాటించండి సార్

హంద్రీనీవా కాలువకు ఇరువైపులా పండ్ల మొక్కలు నాటించండి సార్

శ్రీ సత్య సాయి జిల్లా  (పుట్టపర్తి ) ఆగస్టు 05 : జిల్లావ్యాప్తంగా హంద్రీనీవా కాలువ తదితర సంబంధమైన కాలువలకు ఇరువైపులా బ్లాక్ ప్లాంటేషన్ స్కీం కింద అనువైన పండ్ల మొక్కలు నాటించి పోషించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అడవులు కాలిపోవడంతో అడవి జంతువులకు,పక్షులకు పండ్ల మొక్కలు లేకపోవడంతో ఆహారం లేక పంట పొలాలను ఆశ్రయిస్తున్నరు.  అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతి సంవత్సరం అడవులు కాలిపోవడంతో ఎకలోజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని దీనివల్ల మానవ జీవితనికే సమస్యగా మరే అవకాశం ఉందన్నారు .ఎన్నో జీవరాసులు చనిపోతున్నాయి కోట్ల చెట్లు అగ్నికి ఆహుతి  అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా  ఆహార కొరత, అతివృష్టి అనావృష్టి ఏర్పడుతోందని , దాన్ని సవరించడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలువలకు మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాలన్నారు. జిల్లాలో పర్యావరణం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు ఈ కార్యం అప్పజెబితే శ్రద్ధగా నిర్వహిస్తారని ప్రజాధనం వృథా కాకుండా మొక్కలు బ్రతుకుతాయని, ఇప్పటికైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా మొక్కలు నాటించే కార్యక్రమం అడవులను రక్షించే కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ని కోరినట్లు మీడియాకు తెలిపారు.  నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు భాస్కర్ నాయుడు కలెక్టర్ కి సూచన చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు దివాకర్, సుధాకర్  తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!