ఉపాధి కూలీ చెల్లించండి సారూ…

*9 వారాలుగా అందని ఉపాధి కూలీ.
*ఇబ్బందుల్లో కూలీలు.

హోళగుంద,న్యూస్ వెలుగు: ప్రజలు వలస వెళ్లకుండా గ్రామాల్లోనే ఉపాధి కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు.అయితే ప్రజలు ఉపాధి పనులకు వెళ్తే అధికారులు కూలీ పనుల డబ్బులు చెల్లించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.ప్రధానంగా వివరాలోకెళ్తే కోగిలతోట గ్రామంలో తమకు గత 9 వారాల నుంచి ఉపాధి పనులకు సంబంధించిన కూలీ డబ్బులు అందడం లేదని ఉపాధి కూలీలు లక్ష్మి,బసవరాజు,హనుమంతప్ప పాత్రికేయులకు తెలిపారు.9 వారాలుగా ఉపాధి కూలీ డబ్బులు చెల్లించక పోవడంతో పుట గటపడం ఇబ్బందికరంగా మారిందని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.కావున కూలీల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే సంబంధిత అధికారులు కూలీ 17 గ్రామ పంచాయతీ గాను 17 వేల మంది జాబ్ కార్డులు ఉన్నట్టు. పనికి వెళ్లేవారు 48 20 మంది మండల మొత్తం డబ్బులు విడుదల చేయాలని కోరారు.

Was this helpful?

Thanks for your feedback!