
Kerala ( కేరళ ): వాయనాడ్‌లో  కొండచరియలు విరిగిపడి మరణించిన వారి బంధువులకు దేశ ప్రధాని నరేంద్ర మోడి  2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కుండపోత వర్షాల కారణంగా మంగళవారం కేరళలోని వాయనాడ్‌లో పలు కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి బంధువులకు ప్రధాని నరేంద్ర సానుభూతిని తెలిపారు.  ఈ తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటంతో 11 మంది మరణించినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ధృవీకరించారు.  ఘటన ప్రాంతంలో  రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేస్తున్నట్లు  మంత్రి వీణ జార్జ్ తెలిపారు . ఘటన ప్రాంతంలో  పెద్ద సంఖ్యలో ప్రజలు  చిక్కుకున్నారని వారిని రక్షించేందుకు అన్నీ సహాయక చర్యలు చేపట్టిన మంత్రి  వెల్లడించారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!