ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
పత్తికొండ, న్యూస్ వెలుగు ప్రతినిధి:పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భ్రమరాంబ అధ్యక్షతన ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తికొండ డీఎస్పీ వెంకట రామయ్య, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ సీఐ జయన్న హాజరైనారు. ఈ కార్యక్రమం BC సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు.మొదట పోలీసుఅమర వీరులకు నివాళు లు అర్పించారు.ఈ సభను ఉద్దేశించి DSP మాట్లాడుతూ సమాజం శాంతి యుతంగా కొనసాగాలి అంటే పోలీసు తన విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలి అన్నారు.విధి నిర్వహణలో కొన్ని సందర్భాలలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వర్తించడం వలన ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది అని అన్నారు. అలాంటి వీర పోలీసు జవాన్లకు ప్రతి సంవత్సరము అక్టోబర్ 21 వ తేదిన సంస్మరిస్తూ నివాళులు అర్పిస్తూ ఉంటామన్నారు.తన విధి నిర్వహణలో ఎదుర్కున్న ఇబ్బందులను ,సంఘటనలను సోదాహరణంగా వివరించారు.అమ్మాయిలు టీనేజ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలని ,ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు జరుగుతున్నాయి అని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు.మీ లక్ష్యం,ఆశయం మీరు మరచిపోకూడదు అన్నారు.మీ జీవితం మీ చేతుల్లో ఉంది అన్నారు.మీ జీవితానికి మీరే శిల్పులు అన్నారు.భ్రమరాంబ,ఆస్పరిశ్రీనివాసులు,విలేకరి గోపాల్ డీఎస్పీ వెంకటరామయ్య సేవలను కొనియాడారు.బీసీ సంఘం ఆధ్వర్యంలో పాఠశాలలో అమ్మాయిలకు “పోలీసులు – సమాజభద్రత”అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్య నారాయణ,రాజశేఖర్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.