ఉపాధి హామీలో రాజకీయ జోక్యం తగ్గించాలి, వలసలు నివారించాలి

ఉపాధి హామీలో రాజకీయ జోక్యం తగ్గించాలి, వలసలు నివారించాలి

    సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాజకీయ జోక్యం తగ్గించాలి, వలసలు నివారణకు కృషి చేయాలని, క్షేత్రస్థాయి సిబ్బందిపై వేధింపులు ఆపాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి డి.గౌస్ దేశాయ్, కార్యదర్శి వర్గ సభ్యులు కె.వి నారాయణ, ఎం.డి అంజిబాబులు డిమాండ్ చేశారు.
శుక్రవారం  జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య గారిని కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయనకు వివరిస్తూ ఉపాధి హామీలో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిపై రాజకీయ వేధింపులు ఎక్కువగా అయ్యాయని ఆ కారణం చేతనే ఆలూరు మండలంలో అరికెర గ్రామంలో హత్య జరిగినట్లు వచ్చింది, నిన్న ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఇద్దరు క్షేత్ర సాయి సిబ్బంది దారులు చేసుకొని పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసుకున్నారని, వీటన్నిటికీ కారణం నూతనంగా వచ్చిన ప్రభుత్వ విధానాలు అని చెప్పి వాళ్ళు విమర్శించారు, ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తప్పు చేసి ఉంటే సస్పెండ్ చేసి ఉద్యోగం నుంచి తొలగించవచ్చు, కానీ ఏ తప్పు లేనటువంటి వారిపైన కక్ష సాధింపు జరుగుతా ఉంది, అలాగే ఒకే గ్రామంలో కూటమి సిఫారసు చేసిన సీనియర్ మేటికి మస్టర్ ఇవ్వడం, రెగ్యులర్ సీనియర్ మేటి, ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్నవారికి మస్తది ఇవ్వడం జరుగుతుంది, ఈ కారణంగా వ్యవసాయ కూలీలు కూడా గ్రామాల్లో ఉండే రాజకీయాల వల్ల ఎవరి వద్ద మస్టర్ తీసుకొని పనికి వెళ్లాలో అర్థం కాక, సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు, జిల్లాలో ఇప్పటికే దాదాపుగా 3 లక్షలకు పైగా కుటుంబాలు వలసలు వెళ్లాయి, దీనికంతటికి కారణం ప్రభుత్వ విధానాలే అని వారన్నారు, ఇప్పటికైనా క్షేత్రస్థాయి సిబ్బంది పైన వేధింపులు ఆపి వలసులు అరికట్టేందుకు కృషి చేయాలని వారు అన్నారు, అలాగే వలసలమైన కుటుంబాల పిల్లలు యొక్క చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి, వారికి ప్రత్యేకంగా సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం నష్టపోకుండా చూడాలని కోరారు.
డ్వామా పీడీ స్పందిస్తూ ఈ విషయాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!