తెలుగువారి ఆత్మ గౌరవం పొట్టి శ్రీరాములు

తెలుగువారి ఆత్మ గౌరవం పొట్టి శ్రీరాములు

జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు; చిన్నతనములోనేతెలుగువారి ఆత్మ గౌరవం పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు.. అమరజీవి పొట్టి శ్రీరాములు  ఉద్యోగాన్ని సంపాదించి, అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవకే అంకితమయ్యారన్నారు.. గాంధీ గారి పిలుపుమేరకు ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని మూడుసార్లు జైలు శిక్ష కూడా అనుభవించారన్నారు..అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేశారని, ప్రత్యేక రాష్ట్రం కొరకు 58 రోజులు అమర నిరాహార దీక్ష చేశారని, వారి త్యాగ ఫలితమే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అని కలెక్టర్ పేర్కొన్నారు..

కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని అమరజీవి కి నివాళులు అర్పించారు .

Was this helpful?

Thanks for your feedback!