
మానసిక ఒత్తిడిని అధగమించేందుకు ధ్యానం సాధన చేయండి
న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రతి విద్యార్థి మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానంలో సాధన చేయాలని మాంటిస్సోరి విద్యాసంస్థల డైరెక్టర్ కెఎన్వి రాజశేఖర్ అన్నారు. శనివారం ఒకటవ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండస్ పాఠశాల ఆవరణలో 441 మంది విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కే పుల్లారెడ్డి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేష్, ప్రధానోపాధ్యాయురాలు మీనాక్షి విల్సన్,సీబీఎస్సీ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, కోఆర్డినేటర్ వేణుగోపాల్ రెడ్డి, యోగా శిక్షకులు బోయ శ్రీనివాసులు హాజరై నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరు ఒత్తిడిని అధిగమించాలంటే కొంత సమయాన్ని ధ్యానం సాధనకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో టీచర్లు సిపి రాజేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!