బోల్తా పడిన ప్రవేట్ బస్సు…
స్వల్ప గాయాలతో బయట పడిన ప్రయాణికులు….
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి గ్రామ సమీపంలో ఒక ప్రవేట్ బస్సు బోల్తా పడింది, ఈ విషయం తెలుసుకున్న పత్తికొండ ఆర్టీఓ అధికారులు, పత్తికొండ రూరల్ సి ఐ పులిశేఖర్, తుగ్గలి తహసీల్దార్ రమాదేవి, హుటా హుటిన ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.పూర్తి వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రంలోని గౌరీ గుజునూర్ గ్రామానికి చెందిన భక్తులు ప్రవేట్ బస్సు ఎపి 39యు ఎన్ 1778 వాహనంలో కర్నూల్ జిల్లా మంత్రాలయంలో వెలసిన రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని వారి స్వగ్రామానికి తిరుగు వెళ్ళు ప్రయాణంలో జొన్నగిరి దగ్గర బస్సు బోల్తా పడడంతో బస్సులో వెళుతున్న దాదాపు 30 మంది నుంచి 40 మంది భక్తులకు స్వల్ప గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని, గాయపడిన భక్తులకు మెరుగైన చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుత్తి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించినట్లు జొన్నగిరి పోలీస్ సిబ్బంది తెలియజేశారు.అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ సిబ్బంది తెలియజేశారు….