
చికిత్స అందక గర్భిణీ అవస్థ
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు.అయితే సంబంధిత వైద్య సిబ్బంది మాత్రం హెబ్బటం గ్రామం నుంచి ఓ గర్భిణీ పురిటి నొప్పులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వస్తె వైద్యాధికారులు చికిత్స అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. గర్భిణీ పురిటి నొప్పులతో తీవ్ర ఇబ్బందికి గురైంది.దీంతో గర్భిణీ బంధువులు ఎరుకలు నాగరాజు,మహిళలు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.అనంతరం గర్భిణీ మహిళ తల్లి బోడెమ్మ మాట్లాడుతూ కులవృత్తి చేసి బ్రతుకుతున్నామని,ఆర్థిక పరిస్థితి బాగోలేదని డబ్బులు పోగు చేసుకుని కూతురు గర్భిణి చిన్నిని ఆటోలో తీసుకుని ఆసుపత్రికి వస్తే ఎవరు పట్టించుకోలేదని వాపోయారు.అంతేకాకుండా వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.అలాగే ఎరుకుల హక్కుల సంఘం నాయకుడు నాగరాజు మాట్లాడుతూ ఎరుకుల కులాలు అంటే చిన్న చూపులు చూస్తున్నారని….గర్భిణీ మహిళకు వైద్య చికిత్స అందించాలంటూ నర్సులను వేడుకున పట్టించుకోలేదని…..గర్భిణీ మహిళలు మరణించిన పట్టించుకోరా……అని ప్రశ్నించారు.అలాగే 108కు ఫోన్ చేస్తే వాహనం రాకపోవడంతో,డ్రైవర్ అశోక్ కు ఫోన్ చేసి ప్రైవేట్ వాహనంలో గర్భిణీ మహిళలను తరలించడం జరిగిందన్నారు.