హోళగుంద యువత ఆధ్వర్యంలో ప్రీమియం లీగ్

హోళగుంద యువత ఆధ్వర్యంలో ప్రీమియం లీగ్

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆవరణం నందు సోమవారం హోళగుంద యువత ఆధ్వర్యంలో ప్రీమియం లీగ్ (హెచ్.పి.ఎల్)ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఇందులో భాగంగా మొదటి రోజు కార్యక్రమాన్నికి ముఖ్య అతిథులుగా పాఠశాల ఛైర్మెన్,వైస్ ఛైర్మన్,జిల్లా యువ నాయకులు,మండల సీనియర్ నాయకులు,మండల యువ నాయకులు హాజరై క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.మొదటి జట్టు హోళగుంద వారియర్స్ వర్సెస్ హోళగుంద11 జట్టులతో ఆట ప్రారంభమయింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువకులు,నాయకులు మాట్లాడుతూ మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రికెట్ ఆట పోటీల్లో అందరూ సోదరభావంతో ఆడాలని ఎవరు గెలిచిన….ఎవరు ఓడిన అందరూ సమానంగా ఐక్య మత్యంతో ఉండి రాష్ట్ర స్థాయిలో కూడా మన హోళగుంద మండలం యువకులు క్రికెట్ ఆటలో పోటీ పడి ఉన్నతస్థాయికి ఎదిగి మండలానికి మంచి పేరును తీసుకురావాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!