శ్రీ సవారమ్మ దేవి జాతర ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

శ్రీ సవారమ్మ దేవి జాతర ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

నీటి ఎద్దడి లేకుండా ముమ్మరంగా 4 చెత్తి పంపుల మరమ్మతు
సకాలంలో ఇంటి పన్నులు,కొళాయి పన్నులు, లైసేన్సులను సకాలంలో చెల్లించండి.
సర్పంచ్ కృష్ణవేణి,కార్యదర్శి రాజశేఖర్.
హోళగుంద,న్యూస్ వెలుగు: గ్రామంలో శ్రీ సవారమ్మ దేవి జాతర ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.బుధవారం మండల పరిధిలోని హెబ్బటం గ్రామంలో సర్పంచ్ కృష్ణవేణి అధ్యక్షతన కార్యదర్శి రాజశేఖర్ ఉపసర్పంచ్,వార్డు సభ్యుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ అందరూ సమన్వయంతో కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోదామని తెలిపారు.ముఖ్యంగా గ్రామంలో వేసవి కాలం నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.అలాగే ప్రజలు ఈ నెల 31 లోపు ఇంటి పన్నులు,కొళాయి,లైసెన్సులను సకాలంలో గ్రామ పంచాయితీకి చెల్లించి గ్రామ పంచాయితీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సవారప్ప,వార్డు సభ్యులు సతీష్ రెడ్డి,ముక్కర భీమేశ్,గోవిందమ్మ,గ్రామ పెద్దలు నరసప్ప తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!