
యోగాలో అవినాష్ శెట్టికి ఉత్తమసేవా ప్రశంస పత్రం
అందించిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాష
కర్నూలు, న్యూస్ వెలుగు; యోగా మాస్టర్ అవినాష్ శెట్టికి ఉత్తమ ప్రశంసా పత్రం దక్కింది. ఆదివారం కర్నూలు పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జీల్లా కలెక్టర్ రంజిత్ బాషా అవినాప్కు ప్రశంసా పత్రం అందించారు. 2012లో జిల్లాలో యోగ శిక్షణా శిబిరాలు నిర్వహణను ఆయన ప్రారంభించారు. 12 సంవత్సరాలుగా యోగా రంగంలో ఆయన చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించింది. వందలాది మందికి యోగాలో శిక్షణ ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో 100 మంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 8 మంది అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. కరోనా సమయంలో వ్యాధి బారిన పడ్డ వారికి యోగా ద్వారా ట్రీట్మింట్ ఇవ్వడంలో అవినాష్ శెట్టి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం జాతీయ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో యోకు మరింత ఆదరణ తీసుకువచ్చేందుకు కృషి, చేస్తానని ఈ సందర్భంగా అవినాష్ శెట్టి చెప్పారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar