మాత శిశు మరణాలను నివారించండి; డాక్టర్ శ్రీ లక్ష్మి
మద్దికేరన్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా కార్యకర్తలకు డాక్టర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఆషాడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ లక్ష్మి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు మాతా శిశు మరణాలు తగ్గించాలని, దీనికై గర్భవతులుబాలింతలు,శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని,ఏ ఒక్కరూ అనీమియాతో బాధపడరాదని, ప్రసవాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేటట్లు చూడాలని సూచించారు. ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల శుభ్రత మరియు సురక్షితమైన తాగునీరు పై అవగాహన కల్పించాలని సూచించారు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ,అతిసారా మరియు కలుషిత ఆహారంపై అవగాహన కల్పించాలని తెలిపారు.క్షయ,కుష్టు వ్యాధులపై సర్వే నిర్వహించి వ్యాధులను గుర్తించి చికిత్సలు అందజేయాలని సూచించారు.ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే నిర్వహించాలని,ఈ ఆశ యాప్ సేవలు ప్రతిరోజు పూర్తిచేయాలని తెలిపారు. అనంతరం కిల్కారి వాయిస్ మెసేజ్ పై గర్భవతులు,బాలింతలకు వినేటట్లు చూడాలని తెలిపారు.అనంతరం మాతా శిశు ఆరోగ్యం పై ఆశా కార్యకర్తలకు అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు,హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ భాష,హెల్త్ సూపర్వైజర్ సూర్య నారాయణ,హెల్త్ ప్రొవైడర్లు,ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మి అంజలి,సువర్ణ మాబ్బున్నీ,గాయత్రి మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.