
కుక్కల బెడద నివారణకు పకడ్బందీ చర్యలు

 నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
 నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
రోజు 35 శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు కసరత్తు
న్యూస్ వెలుగు, కర్నూలు; నగరంలో వీధి కుక్కల బెడద నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు శుక్రవారం గార్గేపురం డంప్‌యార్డు కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వీధి శునకాల బెడద ఎక్కువ అయినట్లు ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు డంప్ యార్డులో ఉన్న కుక్కల సంతాన నియంత్రణ కేంద్రంలో ప్రతి రోజూ 20 శునకాలకు ఆపరేషన్లను చేయడానికి సౌకర్యాలు ఉన్నాయని, అదనంగా మరో 15 శునకాలకు ఆపరేషన్లు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన నిర్మాణాలను చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి త్వరలో పనులు ప్రారంభిస్తామని, పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. వీటి నిర్వహణ కోసం యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) మార్గదర్శకాలను పాటించామని, అక్కడి నుండి త్వరలో అనుమతులు వస్తాయన్నారు. వచ్చిన వెంటనే తొలి దశగా ప్రతిరోజూ 20 కుక్కలకు ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. ఇదేకాకుండా నగరంలో పూర్తి స్థాయిలో కుక్కల బెడద నియంత్రణకు భవిష్యత్తు మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ మల్దన్న, డిఈఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar