వ్యాస రచన పోటిలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం

వ్యాస రచన పోటిలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం

కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బుధవారం జిల్లా న్యాయ సేవ సదన్ నందు నిర్వహించిన “అంతర్జాతీయ బాలల దినోత్సవానికి” ముఖ్య అతిధిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి.కబర్ధి హాజరయ్యారు. బాలల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన వివిధ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న హై స్కూల్ 8,9,10వ తరగతి విద్యార్థులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి.కబర్ధి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి , ప్రజా వినియోగ సేవల కోసం శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు వెంకట హరినాథ్, చీఫ్ లీగల్ అయిడ్ డిఫేన్స్ కౌన్సెల్ యస్.మనోహర్, డిప్యూటీ డి.ఈ.ఓ హనుమంత రావు చేతులమీదగా, ప్రథమ బహుమతి సాయి లిఖిత ద్వితీయ బహుమతి సుహృతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం హై స్కూల్, తృతీయ బహుమతి నిర్మల జ్యోతి ఇందిరా గాంధీ మునిసిపల్ హై స్కూల్, ప్రోత్సాహక బహుమతులు, సర్టిఫికేట్లు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో సంబందిత పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గోన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!